header

NB World News

విజ్ఞప్తి : మన కోసం ఈ వార్తలు ప్రారంభించబడ్డాయి. మీకు తెలిసిన వార్తలు విశేషాలు (నాయీబ్రాహ్మణుల సమాజం గురించి మాత్రమే) పెళ్లి పరిచయవేదికలు, సమావేశాలు గురించి తెలుపగలరు.... e-mail: nbworld2017@gmail.com ............Cell: 9247684902

ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం వారి సమావేశం

23-07-2017న 11 గంటలకు గుణదల, అయ్యప్పనగర్ లో నూతనంగా కట్టబడుచున్న AP State Level Community Building లో ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం వారి ప్రధమ సమావేశం (మీటింగ్) జరుగుచున్నదిఇది చదివిన వారు మన ఉద్యోగస్థులకు తెలియచేయగోరుచున్నాము....
ప్రెసిడెంట్ శ్రీ రమణ గారు, సెక్రటరి శ్రీ నాగరాజు గారు (CID Dept).

అన్నవరపు రామస్వామికి ప్రతిభా పురస్కారం...

దేశ, విదేశాలలో పేరు పొందిన మన ప్రఖ్యాత వాయిలిన్ కళాకారుడు శ్రీ అన్నవరపు రామస్వామికి, ఎక్స్ రే సాహిత్య సేవాసంస్థ ప్రతిభా పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమం విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరావు సంగీత, నృత్య కళాశాలలో 20-7-2017 న జరిగింది.

కళాకారుల సమావేశం...

మన వాయిద్య కళాకారుల సంఘ సమావేశం 25-07-2017న విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరగనుంది. ఈ వార్తను ఇంటూరి మురళీకృష్ణ గారు (వాయిద్య కళాకారుల రాష్ట్రప్రదాన కార్యదర్శి) తెలిపారు.దీనికి జాతీయ అధ్యక్షుడు శ్రీ యల్.వి. చెన్నారావు గారు హాజరు కానున్నారు

ఘోర రోడ్డు ప్రమాదంలో మన డాక్టర్ మృతి...

ఇటీవల నెల్లూరు జిల్లా, సూళ్లూరు పేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఒంగోలుకు చెందిన డాక్టర్ అనీల్ కుమార్ (యం.యస్) మరణించారు. వీరి తండ్రి గుంటూరు భాస్కరరావు ఒంగోలులో ఆర్.యం.పి. డాక్టర్ గా పేరుపొందారు.

నాయీ ప్రస్థానం మాస పత్రిక

పయ్యావుల సంతోష్ నాయీ చీఫ్ ఎడిటర్ ..నాయకత్వంలో " నాయీ ప్రస్థానం " మాస పత్రిక హైదరాబాద్ లో ప్రారంభించబడింది. సంతోష్ నాయీగారి మాటలలో.... నాయీ ప్రస్థానం మాస పత్రికను మన ఇంటి పుత్రిక గా భావించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం ... భాగంగా తమ ప్రాంతంలోని మన కులస్థులకు సంబంధించిన కార్యక్రమాలు , నూతన కమిటీలు , సన్మాన సభల వార్తలు , ఫొటోలు , పేపర్ క్లిప్పింగ్స్ ను నాయీ ప్రస్థానం కేంద్ర కార్యాలయానికి పంపడమే ... వారికి సంస్థ తరఫున గుర్తింపు కార్డులను ఇవ్వడం జరుగుతుంది ... అందుకు తమ ఫొటో , ఆధార్ కార్డ్ కాపీ , పోస్టల్ అడ్రస్ మన నాయీ ప్రస్థానం అధికారిక మెయిల్ ఐడి nayeeprasthanam@gmail.com కు పంపడంతో పాటు 9441933711 వాట్సాప్ నంబర్ కు కూడా షేర్ చేయగలరు ...
ఇప్పటికే నాయీ ప్రస్థానం మాస పత్రిక వివిధ జిల్లాల ఇన్ ఛార్జులు , మండలాల ఇన్ ఛార్జులుగా నియమితులైన మిత్రులందరికి అభినందనలు ... తమ జిల్లా పరిధిలో గల మండలాలు వారీగా , నగరాల్లో డివిజన్ల వారీగా ఒకరు చొప్పున సెలక్ట్ చేసి వారి పేర్లు , ఆధార్ నంబర్ , ఫొటో తో సహ వారి పోస్టల్ వివరాలు నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9441933711 కు పంపడంతో పాటు ... నాయీ ప్రస్థానం రాష్ట్ర కార్యాలయ అధికారిక మెయిల్ nayeeprasthanam@gmail.com కు పంపగలరు
9441933711 8096599699 Mail id : nayeeprasthanam@gmail.com

డాక్టర్ నరేష్ బాబుకు మిలియన్ స్విట్జర్లాండ్ డాలర్ల పరిశోధన గ్రాంట్

డాక్టర్ నరేష్ బాబుకు మిలియన్ స్విట్జర్లాండ్ డాలర్ల పరిశోధన గ్రాంట్ మల్లికా స్పైన్ సెంటర్ అధినేత, వెన్నెముక శస్ర్తచికిత్స నిపుణులు డాక్టర్ జె. నరేష్ బాబుకు వెన్నెముకపై పరిశోధనలు చేసేందుకు ‘ఏవో స్పైన్ ఇంటర్నేషనల్ సంస్థ మిలియన్ స్విట్జర్లాండ్ డాలర్లను మంజూరు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ధరఖాస్తు చేసుకున్న 50 మందిలో డాక్టర్ నరేష్ బాబు ఈ గ్రాంట్ కు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని డాక్టర్ నరేష్ బాబు గుంటూరులోని తమ హాస్పటల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు.


నాయీ బ్రాహ్మణుల కులవృత్తుల వారి కోసం నాయీబ్రాహ్మణ ఫెడరేషన్


ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 1989 సం.లో స్థాపించబడినది. కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలైన నాయీబ్రాహ్మణులకు కొద్ది మొత్తాలలో రుణాలిచ్చి ప్రొత్సహించడానికై ఈ సంస్థ స్థాపించబడినది. ఇందులో అద్యక్షులు మరియు 5గురు డైరక్టర్లు ఉంటారు.
పెడరేషన్ వివరాలు :
శ్రీ గుంటుపల్లి నాగేశ్వరరావు అధ్యక్షులు
డైరెక్టర్లు
ముసిడిపల్లి రమణ, నిమ్మనపూడి విజయ్ కుమార్, పెల్లూరు చిన వెంకటేశ్వర్లు,కందుకూరి ద్వారకానాధ్, ఎం. శాంతారాం
నాయీబ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ విజయవాడకు దగ్గరలో గల పోరంకి గ్రామంలో 24-12-2016 శనివారం నాడు ప్రారంభించ బడినది. దీనికి ఛైర్మన్ శ్రీ గుంటుపల్లి నాగేశ్వర రావు గారు.
అంతకు ముందు చిత్తూరు జిల్లాలో జరిగిన సభలో, నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.53 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని రాష్ట్ర నాయీబ్రాహ్మణ సహకార సొసైటీల సమాఖ్య ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వర రావు గారు తెలిపారు.
ఈ నిధులతో నాయీ బ్రాహ్మణులకు బ్యాండ్ లు, వాయిద్యాలు, నాదస్వర పరికరాలు కొనుగోలుకు ఆర్థికసాయం అందజేయటానికి సమాఖ్య కృషి చేస్తుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 13 సొసైటీలకు రూ.1.95 కోట్లు బ్యాంకు రుణం, సబ్సిడీ అందజేసినట్లు తెలిపారు. చేతివృత్తులను ఆధారం చేసుకుని జీవిస్తున్న నాయీబ్రాహ్మణు అభివృద్ధికి సమాఖ్య ఎనలేని కృషి చేస్తోందన్నారు.
నాయీబ్రాహ్మణ మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బ్యూటీ పార్లర్లు, ఫ్యాషన్ డిజైన్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

జాదూగర్ ఆదినారాయణ

శ్రీ ఆదినారాయణ గారు పేరుపొందిన ఇంద్రజాలికులు. వీరు నెల్లూరు జిల్లావాస్తవ్యులు. మనలో ఎవరైనా ఉత్సాహవంతులు ఇంద్రజాలం నేర్చుకునే ఉద్దేశ్వం ఉంటే వారికి ఉచితంగా నేర్పుతామని తెలిపారు.

ప్రసవానికి బయలుదేరి రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన...

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం పి. నాగులవరంకు చెందిన నిండుగర్భిణి పి. రమాదేవి రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈమె తల్లి ఆదినారాయణమ్మ, డ్రైవర్ వెంకటేశ్వర్లు ఒంగోలు రిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించారు. తొడుగా వచ్చిన శాయమ్మను మెరుగైన వైద్యంకోసం గుంటూరు తరలించారు. వీరు ప్రయాణిస్తున్న కారును గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రతివారం మన ప్రముఖులలో ఒకరి గురించి పరిచయం ....
మన ప్రముఖ వ్యక్తులు.... శ్రీమతి దండమూడి సుమతి – మృదంగ విద్యాంసురాలు

శ్రీమతి దండమూడి సుమతీ భారతదేశంలో మొదటి మహిళా మృదంగ విద్యాంసురాలు.మగవారి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రోజులలోనే వీరు మృదంగ విద్యలో ఆరితేరి మగవారికి దీటుగా నిలిచారు. వీరి తల్లి దండ్రులు నిడుమోలు రాఘవయ్య వెంకటరత్నమ్మ గారు.

ఈమె మొదటగా తన తండ్రి దగ్గరే మృదంగ విద్యను నేర్చుకున్నారు. ఈమెకు మొదటి గురువు కూడా ఈమె తండ్రే. మృదంగ విద్య సాధనలో ఈమె తల్లిగారే ఈమెకు అండగా నిలిచారు. తరువాత దండమూడి రామమోహనరావు గారి దగ్గర మృదంగ విద్యను అభ్యసించారు.

మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారిచే వరుసుగా మూడు సార్లు ఉత్తమ మృదంగ విద్వాంసురాలుగా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఈమె విజయవాడలో నివసిస్తున్నారు. ఈమె ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ మరియు విజయవాడ ఘంటశాల వెంకటేశ్వరావు సంగీత నృత్య కళాశాలలొ 25సంవత్సరాలు మృదంగ అధ్యపకురాలుగా పనిచేసి రిటైనారు.

ఈమెకు మృదంగ ‘మృదంగ శిరోమణి’, ‘నాదభగీరథ’, ‘మృదంగ మహారాణి’, ‘సునాద సుధానిధి’ అనే బిరుదులు కలవు.
నార్త్ కరోలినా, అమెరికా వారిచే గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయబడినది. ఈమె ఈ ఆవార్డును అందుకున్న ఏకైక మహిళా మృదంగ వాయిద్యకళాకారిణి

..........